సైకిల్ తొక్కుతూ రైల్వేస్టేషన్‌కు..
ABN , Publish Date - May 19 , 2026 | 06:10 AM
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రంలోని కూటమి నేతలు ఇంధన పొదుపునకు పెద్దపీట వేస్తున్నారు.
మంత్రి సవిత ఇంధన పొదుపు మంత్రం
పెనుకొండ టౌన్, మే 18 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రంలోని కూటమి నేతలు ఇంధన పొదుపునకు పెద్దపీట వేస్తున్నారు. తాజాగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కూడా తన కాన్వాయ్‌లోని వాహనాలను పది నుంచి రెండుకు కుదించుకున్నారు. కొద్ది దూరానికైతే సైకిల్‌పై వెళ్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలంలో సోమవారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు రెండు వాహనాల్లోనే వెళ్లారు. పెనుకొండలో జరిగే కార్యక్రమాలకు కాలినడకన, శుభకార్యాలకైతే ఒక వాహనంలోనే వెళ్తున్నారు. కాగా, సోమవారం విజయవాడ వెళ్లేందుకు మంత్రి తన నివాసం నుంచి స్థానిక నాయకులతో కలిసి పెనుకొండ రైల్వేస్టేషన్ వరకు సైకిల్‌పై వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఇంధన పొదుపు దేశంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.