మెగా డీఎస్సీలో అక్రమాలకు తావు లేదు
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:20 AM
మెగా డీఎస్సీలో అక్రమాలకు తావులేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. అవకతవకలు జరిగాయని ఆధారాలు చూపాలని వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు.
అవకతవకలు జరిగాయని ఆధారాలు చూపండి
మాజీ సీఎం జగన్‌కు మంత్రి సవిత సవాల్
అనంతపురం మే 31(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో అక్రమాలకు తావులేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. అవకతవకలు జరిగాయని ఆధారాలు చూపాలని వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు. ఆదివారం అనంతపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మెగా డీఎస్సీలో వైసీపీ నాయకుల బిడ్డలు టీచర్లుగా ఎంపికై, పాఠాలు చెబుతున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు ఈ రెండేళ్ల పాలనలో వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారన్నారు. జగన్ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేశారా అని ప్రశ్నించారు. మద్యం షాపుల దగ్గర గురువులను కాపలాపెట్టిన దుర్మార్గుడు జగన్ అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించి, 16వేల టీచర్ పోస్టులు భర్తీ చేసిందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని టీడీపీ ప్రకటించడంపై మహిళల నుంచి పెద్దఎత్తున స్పందన వస్తోందన్నారు. దీన్నిచూసి ఓర్వలేని జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారని సవిత మండిపడ్డారు.