Share News

ఆర్డీటీపై మాట నిలబెట్టుకున్నాం

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:42 AM

అనంతపురంలోని రూరల్‌ డెవల్‌పమెంట్‌ ట్రస్ట్‌(ఆర్డీటీ)కు నిధుల సమీకరణకు విదేశీ నిధుల రెన్యూవల్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ)ను పునరుద్ధరణ విషయంలో మాట...

ఆర్డీటీపై మాట నిలబెట్టుకున్నాం

  • బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): అనంతపురంలోని రూరల్‌ డెవల్‌పమెంట్‌ ట్రస్ట్‌(ఆర్డీటీ)కు నిధుల సమీకరణకు విదేశీ నిధుల రెన్యూవల్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ)ను పునరుద్ధరణ విషయంలో మాట నిలబెట్టుకున్నామని మంత్రి సవిత తెలిపారు. 60ఏళ్ల నుంచి ఆ సంస్థ ఉమ్మడి అనంతపురం జిల్లాలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సేవలు అందిస్తోందన్నారు. ఆర్డీటీ సేవలు నిలిపివేసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి సేవలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకుందని తెలిపారు.

Updated Date - Mar 29 , 2026 | 05:42 AM