వైవీ సుబ్బారెడ్డికి రక్షణ కల్పించండి
ABN , Publish Date - Feb 08 , 2026 | 05:07 AM
తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని జగన్ బాబాయ్, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంగీకరించారు. దీంతో ఆయనకు ప్రాణహాని ఉంది.
లడ్డూ కల్తీని అంగీకరించిన ఆయనకు ప్రాణహాని
సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత విజ్ఞప్తి
కడప, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ‘తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని జగన్ బాబాయ్, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంగీకరించారు. దీంతో ఆయనకు ప్రాణహాని ఉంది. సీఎం చంద్రబాబు ఆయనకు రక్షణ కల్పించాలి’ అని మంత్రి ఎస్.సవిత విజ్ఞప్తి చేశారు. శనివారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ కడప పార్లమెంటు నియోజకవర్గ నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత మాట్లాడారు. కల్తీని వైవీ సుబ్బారెడ్డి అంగీకరించడంతో జగన్ అండ్ కో బ్యాచ్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదని మంత్రి సవిత అన్నారు.