Share News

అమరావతిపై విషం చిమ్ముతున్న జగన్‌: సవిత

ABN , Publish Date - Jun 04 , 2026 | 04:40 AM

అమరావతిపై జగన్‌ విషం చిమ్ముతున్నారని మంత్రి సవిత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు....

అమరావతిపై విషం చిమ్ముతున్న జగన్‌: సవిత

అమరావతి, మంగళగిరి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): అమరావతిపై జగన్‌ విషం చిమ్ముతున్నారని మంత్రి సవిత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడని, చేయనివ్వడని విమర్శించారు. రాజధానిపై రోజుకో మాట.. పూటకో ప్రకటనే వైసీపీ సిద్ధాంతమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని స్వాగతిస్తున్నామన్న జగన్‌ అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట మొదలుపెట్టారని అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు మావిగన్‌ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. నలుగురు కుటుంబ సభ్యులున్న జగన్‌కు 4 ప్యాలె్‌సలు ఉండగా లేనిది.. 5 కోట్ల జనాభాకు మంచి రాజధాని అవసరం లేదా అని ప్రశ్నించారు.

Updated Date - Jun 04 , 2026 | 04:40 AM