Minister Savita: జగన్ మానసిక స్థితి బాలేదు
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:06 AM
జగన్ మానసిక పరిస్థితి బాలేదు. లండన్ మందులు వాడినా ఉపయోగం లేదు. రాష్ట్రాన్ని తానే అభివృద్ధి చేసినట్లు భ్రమపడుతున్నారు’ అని కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్.సవిత విమర్శించారు...
రాష్ట్రాన్ని తానే అభివృద్ధి చేసినట్లు భ్రమలో ఉన్నారు : మంత్రి సవిత
కడప, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ‘జగన్ మానసిక పరిస్థితి బాలేదు. లండన్ మందులు వాడినా ఉపయోగం లేదు. రాష్ట్రాన్ని తానే అభివృద్ధి చేసినట్లు భ్రమపడుతున్నారు’ అని కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్.సవిత విమర్శించారు. మంగళవారం జిల్లాలోని వీరపునాయునిపల్లెలో, నందలూరులో పర్యటించారు. వీరపునాయునిపల్లెలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డితో కలిసి జిల్లాలోని ఉల్లి రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున రూ.28.40 కోట్ల పరిహారాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, విశాఖకు డేటా సెంటరు క్రెడిట్ తనదేనని చెప్పుకోవడం చూస్తే జగన్ మానసికస్థితి అర్థమవుతుందని అన్నారు. ఇక్కడి రైతులకు పట్టాదారు పాస్‌బుక్కులు పంపిణీ చేశారు.