నేతన్నలకు గౌరవప్రదమైన జీవనం లక్ష్యం: మంత్రి సవిత
ABN , Publish Date - Apr 09 , 2026 | 05:22 AM
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు గౌరవప్రదమైన జీవనాన్ని కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు.
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని చేనేత కార్మికులకు గౌరవప్రదమైన జీవనాన్ని కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. రాష్ట్రంలోని చేనేత కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల 1 నుంచి ఉచిత విద్యుత్ అమలు చేసింది. ఈ సందర్భంగా ఏపీ పద్మశాలీ సంఘం ప్రతినిధులు అమరావతిలో మంత్రితో భేటీ అయ్యి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సవిత మాట్లాడుతూ.. చంద్రబాబు నేతృత్వంలో కూటమిప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. నూతన టెక్స్‌టైల్ పాలసీ ద్వారా లభించే ప్రయోజనాలు, చేనేత విక్రయాల పెంపునకు చేస్తున్న కృషి వివరించారు.