ఇది ప్రగతి నివేదిక: మంత్రి సత్యకుమార్ యాదవ్
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:34 AM
రెండేళ్ల కూటమి పాలన ప్రగతి నివేదికను ప్రజల ముందు ఉంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
ఇంటర్నెట్ విభాగం: రెండేళ్ల కూటమి పాలన ప్రగతి నివేదికను ప్రజల ముందు ఉంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇవి సంబరాలు, విజయోత్సవాలు కాదని అన్నారు. కూటమిపై నమ్మకంతో ప్రజలు అధికారం ఇచ్చారని, ఇచ్చిన హామీలను అమలుచేసి, వారి రుణం తీర్చుకున్నామని చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లు రాష్ట్రంలో కనివిని ఎరుగనిరీతిలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు.