Share News

స్పష్టమైన కారణమేది?: మంత్రి సత్యకుమార్‌

ABN , Publish Date - May 28 , 2026 | 05:10 AM

ప్రభుత్వ పథకాల పట్ల ప్రజ ల్లో నూటికి నూరు శాతం సానుకూల వాతావరణం ఉంది. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్‌ దానిని ...

స్పష్టమైన కారణమేది?: మంత్రి సత్యకుమార్‌

విజయవాడ సిటీ, మే 27(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ పథకాల పట్ల ప్రజ ల్లో నూటికి నూరు శాతం సానుకూల వాతావరణం ఉంది. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్‌ దానిని రాజకీయ కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్ర రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది’ అని మంత్రి సత్యకుమార్‌ ఆరోపించారు. జగన్‌ చేపట్టే నిరసనలకు స్పష్టమైన కారణంఉందా? అని ప్రశ్నించారు. ‘ఓటర్ల జాబితా ప్రక్రియ రాజ్యాంగబద్ధమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఎన్నికల కమిషన్‌ లక్ష్యం. జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణలో ప్రజలనూ భాగస్వాములను చేస్తాం’ అని మంత్రి తెలిపారు.

Updated Date - May 28 , 2026 | 05:10 AM