Share News

విధ్వంసక పాలనకు స్వస్తి పలికి 2 ఏళ్లు: సత్యకుమార్‌

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:46 AM

రాష్ట్రంలో అహంకార, విధ్వంసక పాలనకు ప్రజలు స్వస్తి పలికి నేటికి రెండేళ్లు పూర్తయిందని మంత్రి సత్యకుమార్‌ అన్నారు. ‘రాష్ట్ర ప్రజలు రెండేళ్ల కిందట ఇదే రోజున చరిత్ర సృష్టించారు.

విధ్వంసక పాలనకు స్వస్తి పలికి 2 ఏళ్లు: సత్యకుమార్‌

అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అహంకార, విధ్వంసక పాలనకు ప్రజలు స్వస్తి పలికి నేటికి రెండేళ్లు పూర్తయిందని మంత్రి సత్యకుమార్‌ అన్నారు. ‘రాష్ట్ర ప్రజలు రెండేళ్ల కిందట ఇదే రోజున చరిత్ర సృష్టించారు. ఆనాటి అహంకారానికి, అరాచకానికి, అవినీతికి, విధ్వంస పాలనకు ప్రజలు జూన్‌ 4, 2024న స్వస్తి పలికి.. కూటమి పాలనకు జై కొట్టారు. ఒక్క చాన్స్‌ పేరుతో వచ్చిన జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రానికి కాపాడేందుకు ప్రజలు ఎన్డీఏ కూటమికి చరిత్రాత్మక విజయాన్ని అందించారు’ అని మంత్రి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి కార్యకలాపాలు పరుగులు పెడుతున్నాయని, రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయని సత్యకుమార్‌ పేర్కొన్నారు.

గోదావరి పుష్కరాల్లో నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాలి

వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న పవిత్ర గోదావరి పుష్కరాల్లో పాల్గొనే భక్తుల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్‌ అధికారులను ఆదేశించారు. పుష్కరాల సమయంలో ముఖ్యంగా నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాలని చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ‘ఆంధ్రప్రదేశ్‌ రైట్‌ టు సైట్‌ సొసైటీ’ గవర్నింగ్‌ బాడీ సమావేశం జరిగింది. జాతీయ అంధత్వ నియంత్రణ, దృష్టి లోపాల నివారణ కార్యక్రమాల అమలులో పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో పారా మెడికల్‌, ఆప్తాల్మిక్‌ ఖాళీల భర్తీకి రీజనల్‌ డైరెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఖాళీల భర్తీకి జీరో వేకెన్సీ విధానాన్ని వర్తింపజేయాలని మంత్రి ఆదేశించారు.

Updated Date - Jun 05 , 2026 | 05:46 AM