అమ్మ భాషతోనే అస్తిత్వం: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:42 AM
ఏ జాతి మనుగడ అయినా అమ్మ భాషతోనే సాధ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వంపైనే కాకుండా ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
డిసెంబరులో ఒంగోలులో ప్రపంచ బాలల తెలుగు మహాసభలు, లోగో ఆవిష్కరణ
ఒంగోలు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఏ జాతి మనుగడ అయినా అమ్మ భాషతోనే సాధ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వంపైనే కాకుండా ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబర్ 5, 6 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించనున్న ప్రపంచ బాలల తెలుగు మహాసభల్లో భాగంగా గురువారం ఓ స్కూల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాసభల లోగోను ఆవిష్కరించారు.