మంత్రి సత్యకుమార్‌కు అస్వస్థత
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:14 AM
మంత్రి సత్యకుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా డిహైడ్రేషన్, మెడనొప్పి సమస్యలతో బాధపడుతున్న ఆయన..
అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): మంత్రి సత్యకుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా డిహైడ్రేషన్, మెడనొప్పి సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం ఇంటిలో ఉండగానే సమస్య మరింత జఠిలమైంది. సాయంత్రం మంగళగిరిలో ఎయిమ్స్‌కు వెళ్లిన ఆయన అక్క డ ఎంఆర్‌ఐతో మరికొన్ని పరీక్షలు చేయించుకున్నారు. పస్తుతం ఆయన మంగళగిరిలోని ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు మంత్రి కార్యాలయ సిబ్బంది తెలియజేశారు.