Share News

పులివెందుల కాలేజీకే రూ.500 కోట్ల ఖర్చు

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:49 AM

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మొత్తం 17 మెడికల్‌ కాలేజీలు నిర్మించేశామంటూ వైసీపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్‌ అసహనం...

పులివెందుల కాలేజీకే రూ.500 కోట్ల ఖర్చు

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మొత్తం 17 మెడికల్‌ కాలేజీలు నిర్మించేశామంటూ వైసీపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్‌ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ... 2023లోనే కొత్త మెడికల్‌ కాలేజీలంటూ హడావుడి చేసినప్పటికీ ఒక్క కాలేజీని కూడా పూర్తిచేయకుండా వదిలేసిపోయారని ఎద్దేవా చేశారు. ‘పార్వతీపురంలో మెడికల్‌ కాలేజీకి భూసేకరణ కూడా చేపట్టలేదు. దాదాపు రూ. 8,500 కోట్ల అంచనా వ్యయంలో వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందుల మెడికల్‌ కాలేజీకి మాత్రమే దాదాపు రూ.500 కోట్లు ఖర్చు పెట్టుకుని.. మిగిలిన మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై తీవ్ర వివక్ష చూపారు’ విమర్శించారు. తాము రానున్న రెండేళ్లలో పీపీపీ విధానంలో 10 వైద్య కళాశాలలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - Mar 05 , 2026 | 04:49 AM