Share News

8,600 పోస్టులు భర్తీ: మంత్రి సత్యకుమార్‌

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:50 AM

‘గత పాలనలో అన్ని శాఖల్లో మాదిరిగానే ఆరోగ్యశాఖలో రూ.6500 కోట్ల లోటు చూపించారు. ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం...

8,600 పోస్టులు భర్తీ: మంత్రి సత్యకుమార్‌

‘గత పాలనలో అన్ని శాఖల్లో మాదిరిగానే ఆరోగ్యశాఖలో రూ.6500 కోట్ల లోటు చూపించారు. ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం సీసీఏ(కరెక్షన్‌, కన్సాలిడేషన్‌, యాక్సిలరేషన్‌) విధానాన్ని అనుసరిస్తోంది’ అని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. బుధవారం అసెంబ్లీల్లో రూ.19,305 కోట్ల ఆరోగ్యశాఖ బడ్జెట్‌ను ఆమోదించాలని ప్రతిపాదించారు. ‘గత 20నెలల్లో వివిధ హోదాల్లో కలిపి 8,600 పోస్టులు భర్తీ చేశాం. ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద 7031 కోట్లు ఖర్చు చేశాం. ఏప్రిల్‌ 1 నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీని అమల్లోకి తీసుకువస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే థామస్‌... 108 సేవలను మరింత పెంచాలని కోరారు. పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలల నిర్మాణాన్ని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్‌ సమర్థించారు. వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ ఐసీయులో ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్‌ ఆరోపించారు.

Updated Date - Mar 05 , 2026 | 04:50 AM