Share News

లడ్డూ ప్రసాదంలో కల్తీ కాదు.. అంతకు మించి!

ABN , Publish Date - Feb 05 , 2026 | 06:42 AM

తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో నాటి వైసీపీ ప్రభుత్వం కల్తీ కాదు.. అంతకు మించి చేసిందని మంత్రి సత్యకుమార్‌ మండిపడ్డారు.

లడ్డూ ప్రసాదంలో కల్తీ కాదు.. అంతకు మించి!

  • పక్కదారి పట్టించేందుకు అంబటితో బూతుపురాణం: సత్యకుమార్‌

గుంటూరు మెడికల్‌, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో నాటి వైసీపీ ప్రభుత్వం కల్తీ కాదు.. అంతకు మించి చేసిందని మంత్రి సత్యకుమార్‌ మండిపడ్డారు. బుధవారం గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన మెడిక ల్‌ ఎగ్జిబిషన్‌ మెడ్‌ఫ్యూజన్‌ 26ను ఆయన ప్రారంభించారు. ప్రదర్శనలో వివిధ స్టాళ్లను మంత్రి సందర్శించారు. అనంతరం కళాశాల ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నెయ్యిలో 10 శాతమో, 20 శాతమో, లేకుంటే 50 శాతమో రసాయనాలు కలిపితే... దానిని కల్తీగా భావించవచ్చు. అసలు నెయ్యే లేకుండా 100 శాతం రసాయన మిశ్రమాన్ని నెయ్యిగా వాడటం దిగ్ర్భాంతిని కలిగించింది. ఈ విష యం ప్రజల్లోకి వెళ్లకుండా అంబటి రాంబాబుతో బూ తు పురాణం చేయించారు. రాజకీయాల్లో ఇతర పార్టీ ల నాయకులను ప్రత్యర్థులుగా మాత్రమే చూడాలి. శత్రువులుగా చూడటం తగదు. మాజీ సీఎం జగన్‌ వైఖరి.. బూతులు మాట్లాడే తమ పార్టీ నాయకులను ప్రోత్సహించేలా ఉంది. ‘మ రిన్ని కొత్త బూతులు నేర్చుకోండి. వాటిని బాగా ప్రాక్టీసు చేయండి. ప్రత్యర్థి పార్టీల నాయకులపై ప్రయోగించండి. అన్న జగన్‌ వైఖరిని ఆయన ప్రవర్తనే చెబుతోంది.’ అన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 06:44 AM