Share News

వివేకా.. సుబ్రహ్మణ్యం.. దస్తగిరి..!

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:09 AM

ఓ వివేకా.. ఓ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం.. ఓ దస్తగిరి! జగన్‌ నేర చరిత్రలో ఇలాంటి ఇంకా ఎన్నో ఘటనలు ఉన్నాయని, దళితుల్ని, పేదల్ని హత్య చేయటం...

వివేకా.. సుబ్రహ్మణ్యం.. దస్తగిరి..!

  • జగన్‌ నేర చరిత్రలో ఇంకా ఎన్నో: మంత్రి సంధ్యారాణి

అమరావతి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఓ వివేకా.. ఓ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం.. ఓ దస్తగిరి! జగన్‌ నేర చరిత్రలో ఇలాంటి ఇంకా ఎన్నో ఘటనలు ఉన్నాయని, దళితుల్ని, పేదల్ని హత్య చేయటం, భూములు లాక్కోవడం జగన్‌ తాతముత్తాతల నుంచి వస్తున్న రక్త చరిత్ర అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా కూడా లేని ఓ పార్టీ రాష్ట్రంలో ఉందన్నారు. ప్రజలు ఆ పార్టీ ఎన్నికల గుర్తు కూడా మర్చిపోయారని, ఆ పార్టీ నాయకుల ప్రవర్తన చూసి గొడ్డలి, కొడవలి గుర్తుతోనే ప్రజలు ఆ పార్టీని గుర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన దళిత డ్రైవర్‌ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, అలాంటి వ్యక్తి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో కొనసాగడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. ఇలాంటి నేరగాళ్లను ప్రోత్సహిస్తున్న జగన్‌ను చూసి సొంత కుటుంబమే చీదరించుకుంటోందని, అలాంటి వ్యక్తి కోసం వైసీపీ కార్యకర్తలు, నాయకులు తమ జీవితాలను పాడు చేసుకోవద్దని హితవు పలికారు.

Updated Date - Apr 24 , 2026 | 05:09 AM