Share News

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి ఆహారం: మంత్రి సంధ్యారాణి

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:52 AM

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి ఆహారం, వసతి కల్పించాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి ఆహారం: మంత్రి సంధ్యారాణి

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి ఆహారం, వసతి కల్పించాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో గిరిజన సంక్షేమశాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్‌ స్కూళ్లు, హాస్టళ్ల పనితీరును సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మెరుగుపరచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడైన గిరిజన కుటుంబానికీ చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Apr 23 , 2026 | 03:52 AM