Share News

డీఎస్సీ అభ్యర్థుల కష్టం గొడ్డలి పార్టీకి ఏం తెలుసు?

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:26 AM

మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులను భయపెట్టేలా మాజీ సీఎం జగన్‌, వైసీపీ నాయకులు మాట్లాడడం శోచనీయమని మంత్రి సంధ్యారాణి అన్నారు.

డీఎస్సీ అభ్యర్థుల కష్టం గొడ్డలి పార్టీకి ఏం తెలుసు?

  • ప్రభుత్వ ఉద్యోగులు అంటే వైసీపీకి గౌరవం లేదు: సంధ్యారాణి

పార్వతీపురం, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులను భయపెట్టేలా మాజీ సీఎం జగన్‌, వైసీపీ నాయకులు మాట్లాడడం శోచనీయమని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఎంత కష్టపడితే ఉపాధ్యాయులు అవుతారో గొడ్డలి పార్టీకి ఏం తెలుసని ప్రశ్నించారు. సోమవారం పార్వతీపురంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులంటే జగన్‌కు గౌరవం లేదని మండిపడ్డారు. జగన్‌కు తన పీఏపై ఉన్న అభిమానం కన్నతల్లి, సొంత చెల్లెలు మీద లేదన్నారు. 1996 నుంచి నేటి వరకు రాష్ట్రంలో 2.15 లక్షల మందికి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 05:27 AM