Share News

100 ఎయిర్‌స్ట్రిప్‌లు, 200 హెలిపోర్టులు

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:34 AM

ఉడాన్‌ 2.0 కింద వచ్చే పదేళ్లలో రూ. 28,840 కోట్ల నిధులతో 100 ఎయిర్‌స్ట్రి్‌ప లు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయనున్నట్లు పౌరవిమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు.

100 ఎయిర్‌స్ట్రిప్‌లు, 200 హెలిపోర్టులు

  • వచ్చే పదేళ్లలో రూ.28,840 కోట్లతో అభివృద్ధి: రామ్మోహన్‌నాయుడు

  • మేలో ఉడాన్‌ 2.0కి మోదీ శ్రీకారం

  • 4 నెలల్లో విజయవాడ టెర్మినల్‌

  • పౌరవిమానయాన మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఉడాన్‌ 2.0 కింద వచ్చే పదేళ్లలో రూ. 28,840 కోట్ల నిధులతో 100 ఎయిర్‌స్ట్రి్‌ప లు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయనున్నట్లు పౌరవిమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రధాని మోదీ మే నెలలో ప్రారంభిస్తారని చెప్పారు. భోగాపురం విమానాశ్రయాన్ని జూన్‌ నెలాఖరులో ప్రారంభిస్తామని.. విజయవాడ కొత్త టెర్మినల్‌ను కూడా 4 నెలల్లోగా ప్రారంభిస్తామని తెలిపారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆదిలాబాద్‌, నాగార్జునసాగర్‌ ఎయిర్‌స్ట్రి్‌పల అభివృద్ధి, కడప, కర్నూలు విమానాశ్రయాల నుంచి సర్వీసులు ప్రారంభించే అవకాశాలున్నాయని చెప్పారు. ఏప్రిల్లో సీ ప్లేన్స్‌ కార్యకలపాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీ ప్లేన్స్‌ కోసం లక్షద్వీప్ లో 5 ఎయిర్‌డ్రోమ్స్‌ను, ఏపీలో ప్రకాశం, శ్రీశైలం, పులికాట్‌ సహా 9 ఎయిర్‌డ్రోమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఉడాన్‌.1 కింద ఇప్పటివరకు రూ.5,500 కోట్లను వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ను భరించామని.. తాజాగా 2.0 కింద రూ.10 వేల కోట్ల వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ను భరించనున్నట్లు తెలిపారు. ఉడాన్‌ 1.0 కింద 93 ఎయిరుపోర్టులను అభివృద్ధి చేశామని..2.0 కింద రూ.12,159 కోట్ల వ్యయంతో ఎయిర్‌స్ట్రి్‌పలను ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. తాను వచ్చాక పైలట్ల కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకున్నానని, ఇప్పటివరకు మూడు శిక్షణ సంస్థలకు అనుమతి ఇచ్చామన్నారు. విమానయాన రంగంలో గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు కొత్త విమానయాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులను స్వదేశానికి తీసుకొచ్చామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ ఏడా ది చివరినాటికి అన్ని విమానాశ్రయాల్లో ఉడాన్‌ యాత్రీ కేఫ్‌లను ప్రారంభిస్తామని, చౌకధరల్లో ప్రయాణికులకు సేవలు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే 13 యాత్రీ కేఫ్‌లను ప్రారంభించామని, ఈ ఏడాదిలోగా 100 కేఫ్‌లు లక్ష్యమని చెప్పారు.

Updated Date - Mar 29 , 2026 | 05:36 AM