అమరావతిపై విషం కక్కుతున్న జగన్: నారాయణ
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:25 AM
‘రాజధాని అమరావతికి 58 రోజుల్లో 34,400 ఎకరాలు భూములిచ్చిన రైతులను ఇనుప కంచెలేసి బంధించారు. మహిళలను బూటుకాళ్లతో కొట్టించారు.
నెల్లూరు(సిటీ), మార్చి 30(ఆంధ్రజ్యోతి): ‘రాజధాని అమరావతికి 58 రోజుల్లో 34,400 ఎకరాలు భూములిచ్చిన రైతులను ఇనుప కంచెలేసి బంధించారు. మహిళలను బూటుకాళ్లతో కొట్టించారు. వైసీపీ అధినేత జగన్ మొదట్నుంచి అమరావతి విషయంలో విషం కక్కుతూనే ఉన్నారు’ అని పురపాలక మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. సోమవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం నేతృత్వంలో రాజధాని పనులు శరవేగంగా జరగడాన్ని చూసి ఓర్వలేక జగన్ విషం కక్కడం మొదలుపెట్టాడు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం వాళ్లకు ఇష్టం లేదు. పార్టీ నాయకుడిగా జగన్, అమరావతిపై క్లారిటీ ఇవ్వాలి అని పేర్కొన్నారు.