Share News

Minister Pyyavula Keshav: ఏమ్మా.. కూలి ఎంత వస్తోంది?

ABN , Publish Date - Jan 04 , 2026 | 04:08 AM

ఏమ్మా.. పొలంలో ఎంతసేపు పనిచేస్తున్నారు..? కూలి ఎంత వస్తోంది..?’’ అని మహిళా వ్యవసాయ కూలీలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అడిగి తెలుసుకున్నారు.

Minister Pyyavula Keshav: ఏమ్మా.. కూలి ఎంత వస్తోంది?

  • అనంతపురంలో మహిళా కూలీలకు మంత్రి పయ్యావుల పలకరింపు

కూడేరు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ‘‘ఏమ్మా.. పొలంలో ఎంతసేపు పనిచేస్తున్నారు..? కూలి ఎంత వస్తోంది..?’’ అని మహిళా వ్యవసాయ కూలీలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు సమీపంలో మెగా డ్రిప్‌ ప్రాజెక్టును శనివారం ఆయన పరిశీలించారు. ఆ సమయంలో వేరుశనగ పైరులో కలుపు తీస్తున్న మహిళా కూలీలను ఆయన పలకరించారు. వారితో కలిసి పొలంలో కూర్చుని మాట్లాడారు. ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీశారు. తల్లికి వందనం, పింఛన్లు తదితర పథకాలతో చేకూరుతున్న లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలన ఎలా ఉందని ఆరా తీశారు. మహిళా కూలీలు స్పందిస్తూ.. పాలన బాగుందని, పథకాలు సక్రమంగా అందుతున్నాయని సంతోషంగా బదులిచ్చారు.

Updated Date - Jan 04 , 2026 | 04:08 AM