ప్రచారం కోసమే జగన్ పండుగలు: పార్థసారథి
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:34 AM
‘వైసీపీ నాయకులకు మతం, పండుగ అంటే కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే’ అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ నాయకులకు మతం, పండుగ అంటే కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే’ అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జగన్ పత్రికలో ఇచ్చే ప్రకటనలు చూస్తుంటే... వారికి ప్రజల సంక్షేమం కంటే జగన్ క్షేమమే ముఖ్యమని స్పష్టమవుతోంది. వైసీపీ హయాం లో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నంతగా గతంలో ఎప్పుడూ జరగలేదు. పండుగలను కేవలం ప్రచారం కోసం వాడుకుంటారే తప్ప హిందూ సంప్రదాయాల పట్ల గౌరవం లేదు. వైసీపీ పాలనలో నిరుద్యోగిత అత్యధికంగా 24 శాతానికి చేరుకుంది. ఉపాధి లేక 4,100 మంది యువత బలవన్మరణానికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించింది. జాబ్ క్యాలెండర్‌ను భవిష్యత్తులో కూడా తప్పకుండా ఇస్తాం’ అని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.