Share News

లండన్‌ అభివృద్ధిపై నారాయణ అధ్యయనం

ABN , Publish Date - Feb 03 , 2026 | 06:04 AM

లండన్‌ పర్యటనలో ఉన్న మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సోమవారం సిటీ ఆఫ్‌ లండన్‌ కార్పొరేషన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌...

లండన్‌ అభివృద్ధిపై నారాయణ అధ్యయనం

అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): లండన్‌ పర్యటనలో ఉన్న మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సోమవారం సిటీ ఆఫ్‌ లండన్‌ కార్పొరేషన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ డైరెక్టర్‌ గిన్‌ రిచర్డ్స్‌తో మంత్రి సమావేశమయ్యారు. లండన్‌ నగరం మాస్టర్‌ ప్లాన్‌, అభివృద్ధి ప్రణాళికలు, రవాణా సౌకర్యాల గురించి ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రి బృందానికి వివరించారు. బాటర్సీ పవర్‌ స్టేషన్‌ను మంత్రి పరిశీలించారు. మూతపడిన పవర్‌స్టేషన్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా లండన్‌ అధికారులు తీర్చిదిద్దిన వైనం, పర్యాటలకును ఆకట్టుకునేందుకు పవర్‌స్టేషన్‌లో చేసిన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌కుమార్‌, అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీ శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 06:05 AM