Share News

ఔట్‌ సోర్సింగ్‌లో లస్కర్ల నియామకం: నిమ్మల

ABN , Publish Date - Feb 25 , 2026 | 04:29 AM

ఇరిగేషన్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో లస్కర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు జలవనరుల మంత్రి రామానాయుడు తెలిపారు.

ఔట్‌ సోర్సింగ్‌లో లస్కర్ల నియామకం: నిమ్మల

ఇంటర్నెట్ డెస్క్: ఇరిగేషన్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో లస్కర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు జలవనరుల మంత్రి రామానాయుడు తెలిపారు. లస్కర్ల కొరతపై టీడీపీ సభ్యులు రాంగోపాల్‌రెడ్డి, బీటీ నాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో 7,224 మంది లస్కర్‌ పోస్టులకు 1,517 మందే పని చేస్తున్నారు. నిరుడు 1,033 మందిని ఔట్‌సోర్సింగ్‌లో తీసుకున్నాం. గత ప్రభుత్వం లస్కర్ల జీతాలు కూడా చెల్లించకపోతే.. రూ.9.16కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించింది. లస్కర్ల రోజు వారీ వేతనాన్ని రూ.350 నుంచి రూ.500కు పెంచాం’ అని చెప్పారు. చైర్మన్‌ మోషేన్‌రాజు జోక్యం చేసుకుని, లాకులు, షట్టర్లకు మరమ్మతులు చేయకుండా లస్కర్ల నియమించి ఉపయోగం ఏంటని అన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

Updated Date - Feb 25 , 2026 | 04:29 AM