Share News

బాబు అపర భగీరథుడు: నిమ్మల

ABN , Publish Date - Jul 14 , 2026 | 03:51 AM

కాటన్‌ మహాశయుడు గోదావరిపై బ్యారేజ్‌ నిర్మాణం చేపట్టకపోతే గోదావరి జిల్లాల ప్రజలు అలమటించే పరిస్థితులు ఉండేవని, ఆ మహానుభావుడి పుణ్య మా అని వందల ఏళ్ల నాటి కట్టడాన్ని..

బాబు అపర భగీరథుడు: నిమ్మల

అమలాపురం, జూలై 13(ఆంధ్రజ్యోతి): కాటన్‌ మహాశయుడు గోదావరిపై బ్యారేజ్‌ నిర్మాణం చేపట్టకపోతే గోదావరి జిల్లాల ప్రజలు అలమటించే పరిస్థితులు ఉండేవని, ఆ మహానుభావుడి పుణ్య మా అని వందల ఏళ్ల నాటి కట్టడాన్ని పునర్నిర్మించడానికి సీఎం చంద్రబాబు అపర భగీరథుడి అవతారమెత్తారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం పిచ్చుకలంక సభలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల గొడ్డలి పార్టీ పాలనలో ప్రమాదభరితంగా ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్‌ను పట్టించుకోలేదని, గేట్లు ప్రమాదానికి గురైతే గోదావరి జిల్లా లు ఎడారి భూములుగా మారే ప్రమాదం ఉందని జలసంఘం చేసిన హెచ్చరికలను సైతం పట్టించుకోలేదని ఆక్షేపించారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చా క రూ.153 కోట్లతో 117 గేట్ల పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. 36 ప్రాజెక్టులకు సంబంధించి ఇరిగేషన్‌ క్యాలెండర్‌ను రూపొందించిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. పిచ్చుకలంక, బొబ్బర్లంక విషయంలో జీవోను సడలించి ఆ భూ ములను పర్యాటక రంగ అభివృద్ధికి కేటాయించాలని నిమ్మల సీఎంను కోరారు. ధవళేశ్వరం గేట్ల పనుల ప్రారంభం, పిచ్చుకలంక కార్యక్రమాలకు మంత్రులు నిమ్మల, కందుల దుర్గేశ్‌, పి.నారాయణ, వాసంశెట్టి సుభాష్‌ రైతులు హాజరయ్యారు. పోలవరం పర్యటనలో సీఎం వెంట మంత్రులు నిమ్మ ల, కొలుసు పార్థసారథి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో వోరా, జల వనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌ శశిభూషణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న పోలవరం జలవిద్యుత్కేంద్రం పనులను పరిశీలించిన చంద్రబాబు.. వచ్చే ఏడాది జూలైనాటికి తొలి విద్యుదుత్పత్తి యూనిట్‌ను గ్రిడ్‌కు అనుసంధానించాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Jul 14 , 2026 | 03:54 AM