Share News

అలసత్వం వద్దు: మంత్రి నిమ్మల

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:44 AM

‘ఏప్రిల్‌, మే నెలల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి అంచనా వ్యయ నివేదికలు ఇవ్వకపోతే ఎలా? ఆదివారం నాటికి ఈ నివేదికలు...

అలసత్వం వద్దు: మంత్రి నిమ్మల

అమరావతి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): ‘ఏప్రిల్‌, మే నెలల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి అంచనా వ్యయ నివేదికలు ఇవ్వకపోతే ఎలా? ఆదివారం నాటికి ఈ నివేదికలు సమర్పించపోతే సచివాలయంలో సోమవారం జరిగే సమీక్షా సమావేశానికి హాజరుకావాల్సిందే’ అని జలవనరులశాఖ చీఫ్‌ ఇంజనీర్లను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా అలసత్వంతో ప్రవర్తించొద్దని సూచించారు. శుక్రవారం విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జల వనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్లతో మంత్రి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Updated Date - Apr 04 , 2026 | 04:45 AM