Share News

గొడ్డలి పార్టీ అధినేతకు రాజకీయాల్లో ఉండే హక్కు లేదు: మంత్రి నిమ్మల

ABN , Publish Date - Jul 04 , 2026 | 04:44 AM

అమరావతి రాజధానిపై విషయం చిమ్ముతున్న గొడ్డలి పార్టీ అధినేత జగన్‌కు రాజకీయాలలో ఉండే హక్కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.

గొడ్డలి పార్టీ అధినేతకు రాజకీయాల్లో ఉండే హక్కు లేదు: మంత్రి నిమ్మల

నందిగామ, జూలై 3(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిపై విషయం చిమ్ముతున్న గొడ్డలి పార్టీ అధినేత జగన్‌కు రాజకీయాలలో ఉండే హక్కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. శుక్రవారం ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకాల మరమ్మతు పనులు ప్రారంభించిన ఆయన విలేకరులతో మాటాడుతూ... ‘ఒక్క అవకాశం అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్‌ సీఎంగా తొలిరోజు నుంచే రాజధాని విచ్ఛిన్నానికి కుట్రలు పన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయడమే ఆయన లక్ష్యం. అటువంటి నీచమైన నాయకులను రాజకీయాలలో ఉండనీయరాదు’ అని పేర్కొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 04:45 AM