Share News

వెలిగొండ నిర్వాసితులకు త్వరలో పరిహారం

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:47 AM

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు త్వరలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం అందజేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

వెలిగొండ నిర్వాసితులకు త్వరలో పరిహారం

  • ప్రాజెక్టు పనులను లక్ష్యం మేరకు పూర్తి చేస్తాం: నిమ్మల

మార్కాపురం, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు త్వరలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం అందజేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబుతో కలిసి టన్నెల్‌-2 లోపలికి వెళ్లి పనుల పురోగతిని చూశారు. విలేకరులతో మాట్లాడుతూ నిర్వాసితుల కోసం అదనపు బడ్జెట్‌లో రూ.905 కోట్లు కేటాయించామన్నారు. ఈ సీజన్‌లోపు నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తీసుకువస్తామని చెప్పారు.

Updated Date - Jun 17 , 2026 | 04:47 AM