Share News

611 లిఫ్ట్‌ల పునరుద్ధరణకు రూ.595 కోట్లు: నిమ్మల

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:21 AM

రాష్ట్రంలో మూలనపడ్డ 611 లిఫ్టుల (ఎత్తిపోతల పథకాల) పునరుద్ధరణకు రూ.595 కోట్లు కేటాయించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

611 లిఫ్ట్‌ల పునరుద్ధరణకు రూ.595 కోట్లు: నిమ్మల

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో మూలనపడ్డ 611 లిఫ్టుల (ఎత్తిపోతల పథకాల) పునరుద్ధరణకు రూ.595 కోట్లు కేటాయించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు పులవర్తి రామాంజనేయులు, ముప్పిడి వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. రూ.1.40కోట్లతో 3 ఇన్లెట్ల పునర్నిర్మాణానికి, రూ.1.80 కోట్లతో స్లూయి్‌సల పునర్నిర్మాణానికి అనుమతులిచ్చామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ తీరువల్ల 1008 లిఫ్ట్‌లు ఉంటే 613 పనిచేయడం లేదని, 158 మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. మిగిలినవి ఎప్పుడు ఆగిపోతాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. 1008 లిఫ్ట్‌లను ఆపరేషన్‌ అండ్‌ మెయింటీనెన్స్‌కు రూ.765 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా దాదాపు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, వైసీపీ నిర్లక్ష్యం కారణంగా అది 4 లక్షలకు తగ్గిపోయిందన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 05:21 AM