Minister Nimmala Rama Naidu: రేపు ఆత్మార్పణ దినం
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:22 AM
మాఘ శుద్ధ విధియ నాడు రాష్ట్ర పండుగగా నిర్వహించే ‘ఆత్మార్పణ దినం’ సందర్భంగా ప్రభుత్వం తరఫున మంత్రి నిమ్మల రామానాయుడు...
ప్రభుత్వం తరఫున కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): మాఘ శుద్ధ విధియ నాడు రాష్ట్ర పండుగగా నిర్వహించే ‘ఆత్మార్పణ దినం’ సందర్భంగా ప్రభుత్వం తరఫున మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించునున్నారు. ఈ మేరకు దేవదాయ శాఖ ఎక్స్‌అఫిషియో సెక్రటరీ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి, మహిశాసురమర్దిని, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 20వ తేదీన ఆత్మార్పణ దినంగా ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు దావోస్‌కు వెళ్లిన నేపథ్యంలో ఆయన స్థానంలో మంత్రి నిమ్మల ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.