Share News

లండన్‌ నుంచి ఖతార్‌కు నారాయణ బృందం

ABN , Publish Date - Feb 05 , 2026 | 05:54 AM

లండన్‌లో మంత్రి నారాయణ బృందం రెండో రోజు పర్యటనలో భాగంగా బుధవారం లండన్‌ స్ట్రాట్‌ఫోర్డ్‌లోని క్వీన్‌ ఎలిజబెత్‌ ఒలింపిక్‌ పార్క్‌ను సందర్శించింది.

లండన్‌ నుంచి ఖతార్‌కు నారాయణ బృందం

అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): లండన్‌లో మంత్రి నారాయణ బృందం రెండో రోజు పర్యటనలో భాగంగా బుధవారం లండన్‌ స్ట్రాట్‌ఫోర్డ్‌లోని క్వీన్‌ ఎలిజబెత్‌ ఒలింపిక్‌ పార్క్‌ను సందర్శించింది. లండన్‌ స్టేడియం, లండన్‌ ఆక్వాటిక్స్‌ సెంటర్‌, హైడ్‌పార్క్‌, లీవ్యాలీ వేలోపార్క్‌ల నిర్మాణాలను అధ్యయనం చేసింది. పుట్‌బాల్‌, రగ్బీ, బేస్‌వాల్‌ గేమ్స్‌ నిర్వహించిన లండన్‌ స్టేడియంలో ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి బృందం.. ఖతార్‌ బయల్దేరి వెళ్లింది. ఖతార్‌ రాజధాని దోహాలో స్పోర్ట్సు సిటీని సందర్శించారు. అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి ప్రణాళిక గురించి దోహా అధికారులతో మంత్రి చర్చించారు.

Updated Date - Feb 05 , 2026 | 05:55 AM