Share News

మావిగన్‌ అంటే జనం నవ్వుకుంటున్నారు

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:26 AM

‘జగన్‌ మావిగన్‌ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని వ్యవస్థలను ఒకచోటకు తీసుకొస్తే, అవగాహన లేకుండా మావిగన్‌ అంటూ..

మావిగన్‌ అంటే జనం నవ్వుకుంటున్నారు

  • ఏ బస్సు ఎక్కాలంటూ ఎద్దేవా చేస్తున్నారు: మంత్రి నారాయణ

తుళ్లూరు, జూలై 8(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ మావిగన్‌ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని వ్యవస్థలను ఒకచోటకు తీసుకొస్తే, అవగాహన లేకుండా మావిగన్‌ అంటూ జగన్‌ మాట్లాడుతున్నారు’ అని మంత్రి నారాయణ విమర్శించారు. రాజధానిలో పర్యటించిన ఆయన పనులు పురోగతిపై కాంట్రాక్టు ప్రతినిధులతో సమీక్షించారు. మంత్రుల బంగ్లాలను పరిశీలించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంత మేరకు పూర్తి అయ్యాయనే దానిపై గుత్తేదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎవరెన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికి అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయి. మావిగన్‌ వర్సెస్‌ అమరావతితో ఎన్నికలకు వెళ్తానంటున్న జగన్‌ మాటలకు వైసీపీ నేతలే చీ కొడుతున్నారు’ అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 04:28 AM