ఉగాదిన లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీ: నారాయణ
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:59 AM
ఉగాది... మార్చి 18న రాష్ట్రంలో లక్ష మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉగాది... మార్చి 18న రాష్ట్రంలో లక్ష మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. శాసనసభలో సాధారణ బడ్జెట్ డిమాండ్లపై చర్చ సందర్భంగా తన శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై వివరణ ఇచ్చారు. ‘జూన్ నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేయడంతో పాటు 2028 కల్లా పట్టణ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. టీడీఆర్ బాండ్ల జారీలో గత ప్రభుత్వం రూ.వందల కోట్లు అక్రమాలకు పాల్పడింది. తణుకులో 63.2 కోట్ల విలువ చేసే బాండ్లకు రూ.691.40 కోట్ల విలువగా చూపించారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది’ అని మంత్రి తెలిపారు.