మూడేళ్లలో రాజధాని రెడీ
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:14 AM
రాజధాని అమరావతి నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామని అసెంబ్లీలో పురపాలక పట్ణణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు.
ఏప్రిల్ ఆఖరుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు పూర్తి: అసెంబ్లీలో మంత్రి నారాయణ
తుళ్లూరు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామని అసెంబ్లీలో పురపాలక పట్ణణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ప్రస్తుతం రాజధానిలో 360 కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల మేర లే అవుట్ రోడ్లు, 4026 ఉద్యోగుల ఇళ్లు, 5 ఐకానిక్ భవనాలు, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని, ఏప్రిల్ ఆఖరునాటికి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.