కుట్రలతోనే మూడుముక్కలాట: నారాయణ
ABN , Publish Date - Mar 29 , 2026 | 04:30 AM
రాజధాని అమరావతి నిర్మాణం కోసం 2014-19 కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.41,170 కోట్లతో టెండర్లు పిలిచి పనులు చేపడితే.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం...
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణం కోసం 2014-19 కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.41,170 కోట్లతో టెండర్లు పిలిచి పనులు చేపడితే.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజకీయ కుట్రలతో ఆ ప్రాజెక్టులన్నింటినీ ధ్వంసం చేసిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడారని మండిపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రూ.59 వేల కోట్లతో 91 ప్రాజెక్టుల రాజధాని ప్రాంతంలో శరవేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.