సీమలో పుట్టిన క్యాన్సర్ గడ్డ జగన్
ABN , Publish Date - May 22 , 2026 | 06:04 AM
‘ఈ రోజు జగన్ ప్రెస్‌మీట్ చూశాక ఆయనకు చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వవచ్చని అనిపించింది. తల్లిని, చెల్లిని తరిమివేశాడు. బాబాయ్‌ని లేపేసి మరో చెల్లికి అన్యాయం చేశాడు.
బయట ముద్దులు పెడతాడు లోపల గొడ్డలి పోటు వేస్తాడు
జగన్మోహన్‌రెడ్డికి చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చు
కూటమి మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ సైకోల కుట్ర
కడప కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేశ్
కడప, మే 21(ఆంధ్రజ్యోతి): ‘ఈ రోజు జగన్ ప్రెస్‌మీట్ చూశాక ఆయనకు చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వవచ్చని అనిపించింది. తల్లిని, చెల్లిని తరిమివేశాడు. బాబాయ్‌ని లేపేసి మరో చెల్లికి అన్యాయం చేశాడు. సొంత జిల్లాను, సొంత నియోజకవ ర్గ ప్రజలను మోసం చేశాడు. రాయలసీమలో పుట్టిన క్యాన్సర్ గడ్డ జగన్మోహన్‌రెడ్డి’ అని మంత్రి లోకేశ్ నిప్పులు చెరిగారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన గురువారం సాయంత్రం కడపకు చేరుకున్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘2019లో సొంత బాబాయిని లేపేసిన జగన్‌రెడ్డి తొలుత గుండెపోటు అన్నారు. తరువాత గొడ్డలివేటు బయటికి వచ్చింది. దొంగ పేపరులో నారాసుర రక్తచరిత్ర అని చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి ఫొటో వేశారు. తరువాత జగన్ ఎంత మోసగాడో ప్రజలకు అర్థమైంది. అందుకే వైసీపీకి ముద్దుగా గొడ్డలి పార్టీ అని పేరు పెట్టాం. రప్పా రప్పా అన్నది వారేకదా. జగన్ సినిమా చూపిస్తే ఎండ్ కార్డ్ చేసే బాధ్యత మా క్యాడర్‌దే. జగన్ నటనకు కచ్చితంగా అస్కార్ అవార్డు వస్తుంది. ఆ నటన చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. బయట ముద్దులు పెట్టి లోపలి గొడ్డలి పోటు వేస్తున్నాడు. ప్రతిపక్షంలోనే భయపడలేదు. ఇప్పుడు భయపడతామా..! కడపలో ఓ పెద్దాయన ఎగిరెగిరి పడుతున్నాడు. త్వరలో టైం వస్తుంది. చట్టాలు ఉల్లంఘించే వారిని వదిలేది లేదు’ అని లోకేశ్ అన్నారు.
కూటమి మధ్య చిచ్చుకు సైకోబ్యాచ్ కుట్ర
‘ఇటీవల ఒక జర్నలిస్టు ఎంత అన్యాయంగా మర్డరు అయ్యాడో చూశాం. సైకో బ్యాచ్ కుట్రలు సాగవు. జనసేన ముసుగులో మనల్ని, టీడీపీ ముసుగులో జనసేనను ఫేక్ అకౌంట్లతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మనమంతా అప్రమత్తంగా ఉండాలి. కూటమి నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి జగన్ ముఠా కుట్రను తిప్పికొట్టాలి. దేవుని గడపలో కూడా కులమతాల మధ్యచిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కుట్ర రాజకీయాలను తిప్పికొట్టే బాధ్యత కార్యకర్తలపై ఉంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున చంద్రబాబు పక్కనే సాధారణ నేతలకు పొలిట్‌బ్యూరో పదవులు ఇచ్చి కూర్చోబెట్టాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పల్నాడులో చంద్రయ్య మెడపై కత్తి పెట్టి వైసీపీ నేతలు తమ నాయకుడికి జై కొట్టాలని అంటే జై తెలుగుదేశం అని ప్రాణాలు ఇచ్చాడు. అటువంటి కరుడుగట్టిన కార్యకర్తలను కాపాడుకునేందుకు కార్యకర్తనే ముందు అనేది నినాదం’ అని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పేర్కొంటూ వాటిని ప్రజలకు వివరించాలని కోరారు. కార్యకర్తల సమావేశం అనంరతం లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రాత్రికి కడపలోనే బస చేశారు. శుక్రవారం జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలంలో సోలార్ పవర్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.