వినూత్నంగా మంత్రి లోకేశ్ జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:50 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలు గురువారం గుంటూరులో అట్టహాసంగా నిర్వహించారు.
ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ నేతృత్వంలో శకటాలతో గుంటూరులో భారీ ప్రదర్శన
గుంటూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలు గురువారం గుంటూరులో అట్టహాసంగా నిర్వహించారు. ఈ నెల 23న లోకేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) చైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో వినూత్నంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ ప్రస్థానానికి అద్దం పట్టేలా వివిధ శకటాలతో గుంటూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రిగా, పార్టీ నేతగా నారా లోకేశ్ సాధించిన విజయాలు, ఘనతలు, చేసిన అభివృద్ధి పనులను, మంగళగిరి నియోజకవర్గాన్ని మోడల్‌గా రూపొందిస్తున్న తీరును, పార్టీ శ్రేణులకు భరోసాగా నిలిచిన అంశాలను, 5 లక్షల బీమా వంటి పలు అంశాలతో శకటాలను రూపొందించి గుంటూరులో ప్రదర్శించారు.