జగన్ నీ గొడ్డలి పోటును జనం మర్చిపోలేదు: మంత్రి మనోహర్
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:14 AM
‘జగన్ వెన్నుపోటు నిరసన ఓ డ్రామా. తాను వేసిన గొడ్డలి వేటును మరిపించేందుకు, ముందస్తు ప్రణాళికతో దాడులకు తెగబడుతున్నారు.
తెనాలి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ‘జగన్ వెన్నుపోటు నిరసన ఓ డ్రామా. తాను వేసిన గొడ్డలి వేటును మరిపించేందుకు, ముందస్తు ప్రణాళికతో దాడులకు తెగబడుతున్నారు. రెచ్చగొట్టేందుకే డ్రామాలువేస్తున్నారు’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ‘వైసీపీ నేతలు ఇప్పటికీ తాము చేసిన తప్పులు గ్రహించటం లేదు. దౌర్జన్యాలు, దాడులు మానుకోవటం లేదు. కేవలం బల ప్రదర్శనకే వైసీపీ ఈ కార్యక్రమం చేపట్టింది. రెచ్చగొట్టి దాడులు చేయించాలన్న ప్రణాళికతో పథక రచన చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులపై పలు చోట్ల దాడులు చేసేందుకు కూడా వైసీపీ మూకలు వెనుకాడలేదు. ఇటువంటి కుట్రపూరిత రాజకీయాలు చేస్తే ఉపేక్షించేది లేదు. ప్రజలను వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదు. అసలైన ద్రోహి జగనే. ఆయన వేసిన గొడ్డలిపోటును, ప్రజలకు పెట్టిన వాతలను ఎవరూ మర్చిపోలేదు. శాంతియుత వాతావరణంలో నిరసనలు తెలపాలే కానీ, దౌర్జన్యాలకు పోతే ప్రజలు ఎప్పటికీ అధికారం దక్కనివ్వరు’ అని మంత్రి మనోహర్ హెచ్చరించారు.