Share News

సంక్షేమం అంటే నువ్వు నొక్కే బటన్‌ కాదు జగన్‌

ABN , Publish Date - May 22 , 2026 | 06:03 AM

‘కూటమి ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమం అంటే నువ్వు నొక్కిన బటన్‌ కాదు జగన్‌. నీలా మేము జనాన్ని మభ్యపెట్టటంలేదు. అర్హులందరికీ సంక్షేమం అందిస్తున్నాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

సంక్షేమం అంటే నువ్వు నొక్కే బటన్‌ కాదు జగన్‌

  • మధ్యాహ్నం భోజనం పథకంపై ఏ స్కూల్‌కు వస్తావో రా

  • నేనూ వస్తా... ఆరోపణలు రుజువు చెయ్యి

  • ఐదు కి.మీ.కు హెలికాప్టర్‌ ఎక్కిన నువ్వా పవన్‌ కల్యాణ్‌ను విమర్శించేది?

  • ఆయన ఓపికను బలహీనత అనుకుంటే ఇబ్బంది పడతావు: మంత్రి మనోహర్‌

తెనాలి, మే 21(ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమం అంటే నువ్వు నొక్కిన బటన్‌ కాదు జగన్‌. నీలా మేము జనాన్ని మభ్యపెట్టటంలేదు. అర్హులందరికీ సంక్షేమం అందిస్తున్నాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మాజీ సీఎం ప్రెస్‌మీట్‌లో చేసిన విమర్శలపై మంత్రి గురువారం స్పందించారు. మధ్యాహ్న భోజనం, దీపం పఽథకాలపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై చేసిన విమర్శలపైన నిప్పులు చెరిగారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చాక డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ఏ పాఠశాలకు వస్తావో నువ్వే చెప్పు. నేనూ అక్కడికి వస్తా. నువ్వు చేసిన ఆరోపణ నిజమని నిరూపిస్తావా! అంటూ సవాల్‌ విసిరారు. పొరుగు రాష్ట్రాల్లో బస్తాపై రూ.500 అదనంగా ఆదాయం వస్తున్నా రైతులు చిత్తశుద్ధితో ఫైన్‌ వెరైటీ బియ్యన్ని ఇవ్వటానికి ముందుకొచ్చారు. దీనిపై విమర్శలు చేస్తే వారిని అవమానించినట్టే. దీపం పఽథకం విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే, దానిపైనా విమర్శలా! పైగా ఒక్క లెక్కకూడా సరిగా లేకుండా అడ్డగోలు ఆరోపణలు చేస్తావా?’ అంటూ మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్‌లలో తిరుగుతున్నారంటూ విమర్శించే ముందు జగన్‌ చేసిన రూ.222 కోట్ల జల్సా తిరుగుళ్లకు బదులివ్వాలి. ఉండవల్లి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతికి, ఉండవల్లి నుంచి పక్కనే ఉన్న తెనాలికి హెలికాప్టర్‌లో వచ్చిన జగన్‌... నువ్వు పవన్‌ కల్యాణ్‌ను విమర్శిస్తావా? సీఎం చంద్రబాబుపై చేసిన వ్యక్తిగత విమర్శలను జనసేన తరపున ఖండిస్తున్నాం. పవన్‌ కల్యాణ్‌ మంచితన్నాన్ని, సహనాన్ని చేతకానితనం అనుకుంటే పొరపాటే. తర్వాత ఇబ్బంది పడాల్సివస్తుంది. మావిగన్‌ అంటూ దిశానిర్దేశం లేని సూచన చేసిన జగన్‌ మానసికస్థితిపై జనం అనుమాన పడుతున్నారు. విజ్ఞానవంతులయితే నవ్వుకుంటున్నారు. అయినా జగన్‌కు సిగ్గనిపించకపోవటం ఆయన అవివేకానికి నిదర్శనం’ అన్నారు.

Updated Date - May 22 , 2026 | 06:04 AM