Share News

గత ప్రభుత్వ పొరపాట్లు సరిదిద్దాం: నాదెండ్ల

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:25 AM

పేదలకు రేషన్‌ పంపిణీ వ్యవస్థలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పొరపాట్లను సరిదిద్ది ప్రజాపంపిణీ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టామని పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌..

గత ప్రభుత్వ పొరపాట్లు సరిదిద్దాం: నాదెండ్ల

ఇంటర్నెట్ డెస్క్: పేదలకు రేషన్‌ పంపిణీ వ్యవస్థలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పొరపాట్లను సరిదిద్ది ప్రజాపంపిణీ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టామని పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. గత ప్రభుత్వం ఎండీయూ వాహనాలను కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాకు రూ.3 వేల కోట్లు నష్టం చేసిందన్నారు. జగన్‌ ప్రభుత్వం దిగిపోయే నాటికి పౌరసరఫరాల సంస్థను రూ.40,750కోట్ల అప్పుల్లో ముంచేస్తే... కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 24,296 కోట్ల అప్పు తిరిగి చెల్లించామన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 05:26 AM