దశలవారీగా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు: మనోహర్
ABN , Publish Date - Feb 25 , 2026 | 04:22 AM
గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం దశలవారీగా జరుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం దశలవారీగా జరుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అడవితల్లి బాట పథకంపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. పీఎం జన్‌మన్, నరేగా, పీఆర్‌ఆర్ పథకాల ద్వారా రూ.1077 కోట్లతో 393 రోడ్లు మంజూరయ్యాయన్నారు. 341 గిరిజన ఆవాసాలకు రూ.914 కోట్లతో 303 రోడ్లు, 33 వంతెనలు మంజూరయ్యాయని తెలిపారు. కొఠియా ప్రాంతంలోని పది గ్రామాల సమస్యను పరిష్కరించాలని కొణతాల కోరారు.