Share News

గ్రామాల్లో 4 వేల కి.మీ. రోడ్లు: మనోహర్‌

ABN , Publish Date - Mar 07 , 2026 | 03:43 AM

రాష్ట్రంలో పల్లె పండుగ కింద 4వేల కిలోమీటర్ల మేరకు సీసీ, బీటీ రోడ్లు వేశామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

గ్రామాల్లో 4 వేల కి.మీ. రోడ్లు: మనోహర్‌

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో పల్లె పండుగ కింద 4వేల కిలోమీటర్ల మేరకు సీసీ, బీటీ రోడ్లు వేశామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రాష్ట్రంలో పల్లె పండుగ 2.0ని ప్రభుత్వం ప్రారంభించిందా? నిధులు ఎంత కేటాయించారన్న విషయమై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తరపున మనోహర్‌ బదులిచ్చారు. రోడ్లతోపాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. మ్యాజిక్‌ డ్రైన్ల నిర్మాణాన్ని రాష్ట్రమంతటా చేపడతామన్నారు. 20 కంటే ఎక్కువ పనులకు అనుమతులిచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 03:55 AM