Share News

యూజ్‌ అండ్‌ కిల్‌... ఇదే జగన్‌ రాజకీయం

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:07 AM

జగన్మోహన్‌రెడ్డి కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి ఆరోపించారు.

యూజ్‌ అండ్‌ కిల్‌... ఇదే జగన్‌ రాజకీయం

  • జగన్‌ కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య: మంత్రి మండిపల్లి

అమరావతి, విజయనగరం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): జగన్మోహన్‌రెడ్డి కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి ఆరోపించారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జగన్‌ కనుసన్నల్లో జరిగిన వివేకా హత్యను చంద్రబాబు మీదకు నెట్టే యత్నం చేసినట్లుగానే... పెద్ద దస్తగిరి హత్యనూ తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న నాయకుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన నైజాన్ని వీడడు. నేర సామ్రాజ్యాలు స్థాపించి వాటిని ముందుకు తీసుకెళ్లడం జగన్‌కే సాధ్యం. పెద్ద దస్తగిరి, రవీంద్రనాథ్‌ రెడ్డికి బినామీ వ్యవహరించినట్లు డాక్యుమెంట్లు బట్టబయలైనా ఇంకా బుకాయించి, తప్పుదోవ పట్టించే యత్నం వైసీపీ నేతలు చేస్తున్నారు. యూజ్‌ అండ్‌ కిల్‌... జగన్‌ అనుసరిస్తున్న రాజకీయ పాలసీ. పెద్ద దస్తగిరి హత్యతో రేపు తమ పరిస్థితి ఏంటనే భయం కడప వైసీపీ నేతల్లో మొదలైంది. జగన్‌లో నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఏ కొంచెం ఉన్నా వెంటనే అనంతబాబుతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించాలి’ అని మంత్రి మండిపల్లి డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 26 , 2026 | 05:07 AM