Share News

పేద ముస్లిం నివాసానికి మంత్రి లోకేశ్‌

ABN , Publish Date - Mar 19 , 2026 | 05:52 AM

పవిత్ర రంజాన్‌ మాసం వేళ... జోరు వానలో బుధవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి పోలకంపాడులో పేద ముస్లిం షేక్‌ అమీర్‌ నివాసానికి మంత్రి లోకేశ్‌ వచ్చారు.

పేద ముస్లిం నివాసానికి మంత్రి లోకేశ్‌

తాడేపల్లి టౌన్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): పవిత్ర రంజాన్‌ మాసం వేళ... జోరు వానలో బుధవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి పోలకంపాడులో పేద ముస్లిం షేక్‌ అమీర్‌ నివాసానికి మంత్రి లోకేశ్‌ వచ్చారు. ఈ సందర్భంగా ముస్లింలకు మంత్రి లోకేశ్‌ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అమీర్‌ కుటుంబ సభ్యులతో కలసి ఇఫ్తార్‌ విందు స్వీకరించారు. ‘ప్రస్తుతం ఉన్న ఇల్లు ఇరుకుగా ఉంది. వర్షం వస్తే కారుతోంది. ఇల్లు నిర్మించి ఇవ్వండి’ అని అమీర్‌ తల్లిదండ్రులు కోరడంతో ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


‘ఉస్తాద్‌’కు శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్‌

‘ఉగాది రోజున విడుదల అవుతున్న పవనన్న సినిమా ప్రేక్షకులను అలరించి, ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి పవన్‌ కల్యాణ్‌ స్పందిస్తూ... ఉస్తాద్‌ విజయం సాధించాలని ఆకాంక్షించిన సోదరుడు, సహచర మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు అని పోస్టు చేశారు.

కూటమితోనే ముస్లింల సంక్షేమం సాధ్యం: నసీర్‌

అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే ముస్లింల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ అన్నారు. ఇమాం, మౌజమ్‌లకు గౌరవ వేతనం కింద రూ.45 కోట్లు విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 19 , 2026 | 05:53 AM