Share News

రండి.. కలిసి రాష్ర్టాభివృద్ధి చేద్దాం

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:39 AM

రాజకీయాలు రాష్ట్రంలో చేద్దాం. రాష్ట్రం బయటకు వెళ్లినప్పుడు కలిసికట్టుగా ఉందాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేద్దాం.

రండి.. కలిసి రాష్ర్టాభివృద్ధి చేద్దాం

  • రాజకీయాలు రాష్ట్రంలో చూసుకుందాం.. బయట అందరం కలిసికట్టుగా ఉందాం

  • మీకు తెలిసిన ఐటీ కంపెనీలుంటే చెప్పండి

  • వైసీపీ సభ్యులకు మంత్రి లోకేశ్‌ పిలుపు

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ‘రాజకీయాలు రాష్ట్రంలో చేద్దాం. రాష్ట్రం బయటకు వెళ్లినప్పుడు కలిసికట్టుగా ఉందాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేద్దాం. వైసీపీ సభ్యులకు తెలిసిన ఐటీ కంపెనీలు ఉన్నా మాకు చెప్పండి.. కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధి చేద్దాం. ఇందుకు సభ్యులందరి సహకారం అవసరం. టీమ్‌-11కి కూడా ఆఫర్‌ ఇస్తు న్నాం’ అని మంత్రి లోకేశ్‌ పిలుపునిచ్చారు. బుఽధవారం అసెంబ్లీలో ఐటీ బడ్జెట్‌ ఆమోదం కోసం సభలో ప్రతిపాదించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఐటీ రంగంలో విశాఖను గ్లోబల్‌ మ్యాప్‌లో పెట్టబోతున్నామన్నారు. ఐటీ విభాగంలో ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించేలా సీఎం చంద్రబాబు తనకు లక్ష్యంగా పెట్టారని, దీనికి మంత్రులం తా కలిసికట్టుగా కృషి చేస్తున్నామని చెప్పా రు. హైదరాబాద్‌, బెంగళూరులలో ఐటీ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టిందని, దానిని ఏపీలో పదేళ్లలో చేసి చూపిస్తామన్నారు. ఒక్క ఐటీ రంగంలోనే రూ.1.50 లక్షల కోట్ల విలువైన 52 ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపా రు. వీటి ద్వారా 2.3 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. క్వాంటంలో కూ డా పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నామని, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం రెన్యువబుల్‌ ఎనర్జీ పరిశ్రమలు, ఐటీ సంస్థలపై ఒక యుద్ధమే చేసిందని విమర్శించారు. ఈ చర్య ల వల్ల ఏపీ యువత తీవ్రంగా నష్టపోయిందన్నారు. 2014-19 మధ్యలో సీఎం చంద్రబాబు ఫైనాన్సియల్‌ సర్వీసె్‌సలో వరల్డ్‌ బెస్ట్‌ అయిన ఫార్చ్యున్‌-500 కంపెనీతో మాట్లాడి ఒప్పించడంతో ఆ కంపెనీ సీఈవో వచ్చి విశాఖలో కార్యాలయం ప్రారంభించారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబుపై కక్షతో ఆ కంపెనీపై పార్లమెంట్‌లో వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారన్నారు. 2019-24 మధ్య ఒక్క ఐటీ కంపెనీకి కూడా ప్రోత్సాహకాలు విడుదల చేయలేదన్నారు. ‘‘2024 ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం వచ్చాక కంపెనీలతో మాట్లాడినప్పుడు వారు భయాన్ని వ్యక్తం చేశారు. గత పాలకులు మళ్లీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు ఏమిటన్నారు. గతంలోనూ వారి వల్ల నష్టపోయామన్నారు. తెలంగాణకు హైదరాబాద్‌, తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌కు బ్రాం డ్‌ చంద్రబాబు ఉన్నారని వారికి చెప్పాను. ఐటీ శాఖలో 8 పాలసీలు తీసుకువచ్చాం. ఎలకా్ట్రనిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ పాలసీతో పాటు మరికొన్ని పాలసీలు తీసుకువచ్చాం. వరల్డ్‌ క్లాస్‌ జాబ్‌లు క్రియేట్‌ చేసే టాప్‌-500 ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తే ఎకరా రూపాయికి కేటాయిస్తామని పాలసీ తెచ్చాం. దీంతో కాగ్నిజెంట్‌ విశాఖకు వచ్చి శంకుస్థాపన కూడా చేసింది. దీనివల్ల 25 వేల ఉద్యోగాలతో పా టు విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌లో 1.8 బిలియన్ల డాలర్ల నుంచి 2.2 బిలియన్‌ డాలర్ల వరకూ ప్రభావం ఉంటుంది. అలానే గూగుల్‌ డేటా సెంటర్‌ రానుంది.’’ అని లోకేశ్‌ అన్నారు.


హోటళ్లకు ప్రోత్సాహకాలు

  • ఉత్తర్వులు జారీ చేసిన పర్యాటక శాఖ

రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీ లు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. బుధవారం పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాజమండ్రిలో ఫోర్‌స్టార్‌ హోట ల్‌ నిర్మాణానికి కాంపస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవే టు లిమిటెడ్‌, విశాఖలో బీచ్‌ రిసార్ట్స్‌ నిర్మాణానికి రుషికొండ బీచ్‌ రిసార్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, చీరాలలో లెమన్‌ ట్రీ రిసార్ట్స్‌ పేరు తో అక్షయ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ సంస్థ ఫోర్‌ స్టార్‌ హోటల్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. అలానే విశాఖ రుషికొండ ప్రాం తంలో వీరాంజనేయ హాస్పిటాలిటీ సంస్థ త్రీస్టార్‌ హోటల్‌ నిర్మాణానికి ముందుకు వచ్చింది. అల్లూరి జిల్లాలోని అనంతగిరిలో రిసార్ట్‌తో పాటు కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఎకో-ఎల్‌ రిసార్ట్స్‌ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. వీటికి వంద శాతం ఎస్‌జీఎ్‌సటీ రీయింబర్స్‌మెంట్‌, ఫిక్స్‌ క్యాపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ను 10 శాతం సబ్సిడీ ఇవ్వనుంది.

Updated Date - Mar 05 , 2026 | 04:39 AM