నిరుద్యోగులకు లోకేశ్ పెద్ద అండ: బ్రహ్మం చౌదరి
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:31 AM
నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడం ద్వారా...
అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడం ద్వారా నిరుద్యోగులకు తాను పెద్దన్నలా అండగా ఉంటానని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు’ అని కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి అన్నారు. జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడంపై శాప్ చైర్మన్ రవినాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు నిజమైన ఉగాది పండుగను లోకేశ్ తీసుకొచ్చాని అన్నారు.
నిరుద్యోగులకు వరం: బీసీ సంఘం
నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్‌ను ఉగాది కానుకగా విడుదల చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేశ్ హర్షం వ్యక్తం చేశారు. విద్యా మంత్రి లోకేశ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు వరమన్నారు.