ఒకే పార్టీ.. విరుద్ధ తీర్మానాలు: లోకేశ్
ABN , Publish Date - Feb 19 , 2026 | 06:00 AM
శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ ఎమ్మెల్సీలపై పట్టు కోల్పోయారని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ ఎమ్మెల్సీలపై పట్టు కోల్పోయారని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో బుధవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల తీరును ఎండగట్టారు. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు పరస్పర విరుద్ధంగా రెండు వాయిదా తీర్మానాలు ఇచ్చారన్నారు. ఒకరు లడ్డూ కల్తీపై చర్చకు డిమాండ్ చేస్తుంటే, మరొకరు ఇందాపూర్ డెయిరీపై చర్చకు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. వారి కొట్లాటలో ఎవరు పైచేయి సాధిస్తారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అన్నారు.