ప్రతిపక్షాల తీరుతో దక్షిణాదికి అన్యాయం: లోకేశ్
ABN , Publish Date - Apr 19 , 2026 | 03:43 AM
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం చేశాయని మంత్రి లోకేశ్ ఆరోపించారు.
అమరావతి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం చేశాయని మంత్రి లోకేశ్ ఆరోపించారు. 2026 తర్వాత జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందని, అదే జరిగితే అభివృద్ధి సాధించిన రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వైఖరి దేశ ప్రయోజనాలకు విరుద్ధమని లోకేశ్ ‘ఎక్స్’లో విమర్శించారు.