నేను టీచర్ల వైపు.. జగన్ రౌడీల వైపు!
ABN , Publish Date - Sep 24 , 2026 | 03:59 AM
మాజీ సీఎం వైఎస్ జగన్ రౌడీషీటర్ల వైపు నిలవాలని నిర్ణయం తీసుకున్నారు.. అందుకే టీచర్లపై దాడి చేసిన రౌడీమూకలకు మద్దతుగా నిలుస్తున్నారని మంత్రి లోకేశ్ ధ్వజమెత్తారు. తాను మాత్రం టీచర్ల వైపు.. స్పోర్ట్స్‌మెన్ వైపు నిలబడాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. టీచర్లపై దాడి చేసిన రౌడీషీటర్లతో జగన్ దిగిన ఫొటోలను తన పోస్టుకు ట్యాగ్ చేశారు.
‘ఎక్స్’లో లోకేశ్ పోస్టు
అమరావతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్ జగన్ రౌడీషీటర్ల వైపు నిలవాలని నిర్ణయం తీసుకున్నారు.. అందుకే టీచర్లపై దాడి చేసిన రౌడీమూకలకు మద్దతుగా నిలుస్తున్నారని మంత్రి లోకేశ్ ధ్వజమెత్తారు. తాను మాత్రం టీచర్ల వైపు.. స్పోర్ట్స్‌మెన్ వైపు నిలబడాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. టీచర్లపై దాడి చేసిన రౌడీషీటర్లతో జగన్ దిగిన ఫొటోలను తన పోస్టుకు ట్యాగ్ చేశారు.
తొందరపాటు ప్రకటనలు చేయొద్దు
మంత్రులతో బ్రేక్‌ఫాస్ట్ భేటీలో లోకేశ్
స్థానిక ఎన్నికల్లో పొత్తుల అంశంపై ఎవ్వరూ తొందరపడి ప్రకటనలు చేయవద్దని, ఈ విషయాన్ని సమన్వయ కమిటీ, కూటమి పార్టీల అధిష్ఠానాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని మంత్రి లోకేశ్ అన్నారు. క్యాబినెట్ సమావేశానికి ముందు ఉండవల్లి నివాసంలో టీడీపీ మంత్రులతో ఆయన బ్రేక్‌ఫాస్ట్ భేటీ నిర్వహించారు. అక్టోబరులో ఎన్నికలు జరుగుతాయని.. ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. కోర్టులో పెండింగులో ఉన్నవి కూడా త్వరితగతిన పరిష్కరించుకుని అన్నిచోట్లా ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్నికలు వాయిదా పడాలన్న గొడ్డలి పార్టీ కుయుక్తులు పని చేయవన్నారు. విద్యా శాఖను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు పన్నుతున్న కుట్రల విషయంలో తనతోపాటు సంబంధిత మంత్రులూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గురువులపై గూండాలతో దాడులు చేయించే దుశ్చర్యకు గొడ్డలి పార్టీ పాల్పడిందని, శాప్ కార్యాలయం వద్దకు వచ్చి దాడులకు తెగపడి మీసాలు మెలేసినవారు, పోలీసులు చట్టప్రకారం కేసులు పెట్టగానే పరారయ్యారని ఎద్దేవాచేశారు. టీచర్లను కించపరుస్తూ ఎవరైనా దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
నేను టీచర్ల వైపు.. జగన్ రౌడీల వైపు!
మాజీ సీఎం జగన్ రౌడీషీటర్ల వైపు నిలవాలని నిర్ణయం తీసుకున్నారు.. అందుకే టీచర్లపై దాడిచేసిన రౌడీలకు మద్దతుగా నిలుస్తున్నారని మంత్రి లోకేశ్ ధ్వజమెత్తారు. తాను మాత్రం టీచర్ల వైపు.. స్పోర్ట్స్‌మెన్ వైపు నిలబడాలని నిర్ణయం తీసుకున్నానని ఎక్స్‌లో పేర్కొన్నారు.