Share News

అమరావతిపై మీ వైఖరేంటి?

ABN , Publish Date - Mar 29 , 2026 | 04:42 AM

అమరావతిపై మీ వైఖరేంటని మాజీ సీఎం జగన్‌ను మంత్రి లోకేశ్‌ సూటిగా ప్రశ్నించారు. అమరావతికి, ఆంధ్రప్రదేశ్‌కు అనకూలమో, వ్యతిరేకమో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అమరావతిపై మీ వైఖరేంటి?

  • జగన్‌కు మంత్రి లోకేశ్‌ సూటి ప్రశ్న .. అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలి

  • జగన్‌కు మంత్రి లోకేశ్‌ సూటి ప్రశ్న

  • అసెంబ్లీలో కీలక సమావేశం వేళ బెంగళూరులో ఏం చేస్తున్నారు?

  • ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణే మా విధానం: లోకేశ్‌

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): అమరావతిపై మీ వైఖరేంటని మాజీ సీఎం జగన్‌ను మంత్రి లోకేశ్‌ సూటిగా ప్రశ్నించారు. అమరావతికి, ఆంధ్రప్రదేశ్‌కు అనకూలమో, వ్యతిరేకమో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం అసెంబ్లీలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ‘కీలకమైన అంశ ంపై ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించ ుకున్నాం. ఆయన సభకు రాలేదు. 11మం దిలో ఒక్కరు కూడా రాలేదు. వైసీపీ సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మీరు అమరావతికి, ఆంధ్రప్రదేశ్‌కి అనుకూలమా? వ్యతిరేకమా? ఇంత కీలకమైన బిల్లుపై చర్చ జరుగుతుంటే బెంగుళూరులో ఏం చేస్తున్నారో జగన్‌ సమాధానం చెప్పాలి.’ అని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ‘దొంగబ్బాయి ఎపుడూ దొంగమాటలే చెబుతారు. ఆయనకు దొంగ పేపర్‌, చానల్‌ ఉన్నాయి. ప్రజలకు దొంగమాటలు చెప్పడానికి మళ్లీ పాదయా త్ర చేస్తానని అంటున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి’ అని ప్రజలను లోకేశ్‌ హెచ్చరించారు.


అమరావతి... ఒక ఎమోషన్‌

‘అమరావతి రైతులకు మనందరం శిరస్సు వంచి నమస్కరించాలి. వారి త్యాగం వల్లే మనమంతా ఇక్కడ కూర్చున్నాం. 5కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తుకు శాశ్వత పునాది వేసి, వారి ఆశలకు రెక్కలు తొడిగి, వారి కలలను సాకారం చేసే ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ఒక తీర్మానం కాదు. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిపోతుంది’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

‘అమరావతి అనేది కేవలం భూమి కాదు, ఒక ఎమోషన్‌. రైతుల త్యాగంతో ఏర్పడింది. రైతుకు భూమి కేవలం ఆస్తికాదు, అది వాళ్ల జీవితం, గుర్తింపు, వారి భవిష్యత్తు. అలాంటి భూమిని త్యాగం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న పలువురు రాజధానిలో కుల ప్రస్తావన తెచ్చారు. ఒకే కులా నికి దోచిపెడుతున్నామని అనేక ఆరోపణలు చేశా రు. పొన్నూరు నాగేశ్వరరావు అనే దళిత రైతు రాజధాని కోసం భూమి ఇచ్చారు. ఆ భూమి ధర పెరగడంతో వారి పాపను ఎంబీబీఎస్‌, కుమారుడ్ని ఎంబీఏ చదివించారు. అమరావతి వల్ల ఎంతో మంది జీవితాలు మారిపోయాయి. ఢిల్లీ తరహాలో కాలుష్యం, బెంగుళూరులా ట్రాఫిక్‌ కష్టాలు ఉండకూడదన్న ఉద్దేశంతో కచ్చితమైన ఎకో సిస్టమ్‌తో అమరావతిలో రాజధానిని నిర్మించాలని చంద్రబాబు భా విం చారు. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా అ త్యుత్తమ ప్రమాణాలతో రాజధాని ప్లాన్‌ రూపొందించారు. ఒకప్పుడు అనంతపురం జిల్లా అభివృద్ధిలో చివరి స్థానంలో ఉండేది. కియా పరిశ్రమ వచ్చిన తర్వాత తలసరి ఆదాయంలో టాప్‌-5కి చేరుకుంది. డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానంతో హర్టికల్చర్‌ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఉత్తరాంధ్రకూ అభివృద్ధిలో సమ ప్రాధాన్యం ఇస్తూపరిశ్రమలను తీసుకొచ్చారు.’


అమరావతి మహిళలపై దాష్టీకం

‘మూడు ముక్కలాటపై జగన్‌ చేసిన ప్రకటనతో అమరావతి రైతులు పెద్దఎత్తున ఉద్యమించారు. 5కోట్ల మంది ఆంధ్రుల కోసం 1,631 రోజులు పోరాడారు. ఎప్పుడూ గడపదాటని మహిళలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే వారిని బూటు కాళ్లతో తన్నారు. జుట్టుపట్టుకుని ఈడ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని అడిగినందుకు ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. మంగళగిరి నియోజకవర్గం కృష్ణాయపాలెంలో భూములు త్యాగంచేసిన దళిత రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆనాడు ఉద్యమానికి కవరేజీ ఇచ్చినందుకు మీడియాపైనా కేసులు పెట్టారు. రైతులను, ప్రతిపక్ష నేతలను ఎవ్వరినీ వదలలేదు. అందరిపై కేసులు పెట్టారు. 2023లో రాజధాని ప్రాంతంలో యువగళం పాదయాత్ర చేస్తూ, రైతులను కలిశాను. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం అని చెప్పాను. ఎన్డీయే కూటమి దీనికే కట్టుబడి ఉంది.’

మండలి చైర్మన్‌పై చేయిచేసుకున్నారు

‘మూడు రాజధానుల బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని అడిగినందుకు మమ్మల్ని దూషించారు. చంద్రబాబును అనరాని మాటలతో అవమానించారు. నాడు మండలి చైర్మన్‌ షరీఫ్‌ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపిస్తున్నామని చెప్పినందుకు మంత్రులు టేబుళ్లపై నిలబడ్డారు. ఒక మంత్రి లోపలికి వెళ్లి చైర్మన్‌పై చేయి కూడా చేసుకున్నారు. అడుగడుగునా మమ్మల్ని అవమానించారు.అయినా ఫర్వాలేదు. 5కోట్ల మంది ఆంధ్రుల కోసం నిలబడాలని చంద్రబాబు చెప్పిన మాట మేరకు పోరాడాం.


జగన్‌ పాలనతో 30 ఏళ్లు వెనక్కి..

‘ఈ భూమిపై ఎవరూ శాశ్వతం కాదు. కానీ వ్యవస్థలు శాశ్వతం. చంద్రబాబు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాద్‌ అభివృద్ధిని కొనసాగించారు. కానీ ఏపీలో ఒక్క వ్యక్తి కారణంగా తీవ్రమైన విధ్వంసం జరిగింది. ఆయన పాలనలో 30ఏళ్లు వెనక్కి వెళ్లాం. పారిశ్రామిక వేత్తలను కలిస్తే మళ్లీ జగన్‌ రారని గ్యారెంటీ ఇస్తారా అని అడుగుతున్నారు. నేడు దేశంలోకి రూ.వంద పెట్టుబడులు వస్తే అందులో 25.3 శాతం ఏపీకి వస్తున్నాయి. జగన్‌ రాకపోయి ఉంటే 50శాతం వచ్చేవి. ఏపీకి ఇన్ని పెట్టుబడులు వస్తాయని టీం-11 కెప్టెన్‌, పులివెందుల ఎమ్మెల్యే ఊహించలేదు. ఆర్సెలార్‌ మిట్టల్‌ రాష్ట్రానికి వస్తుందటే ఎగతాళి చేశారు. ఏ ఒక్క జిల్లా వెనుకబడకూడదు అన్ని జిల్లాలు సమగ్రాభివృద్ధి చెందాలి. కానీ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. సీఎం, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో అమరావతి ఏకైక శాశ్వత రాజధాని అని తీర్మానం చేసి, పార్లమెంటులో ఆమోదం పొందాలని కోరుతున్నా. పొరపాటున ఇకపై ఏ తుగ్లక్‌ వచ్చినా రాజధానిగా అమరావతిని మార్చలేరు’ అని లోకేశ్‌ స్పష్టం చేశారు. సీఎం ప్రవేశపెట్టిన అమరావతి తీర్మానాన్ని బలపర్చే అవకాశం లభించినందుకు ధన్యవాదాలు తెలిపారు.


  • ఆనాడు జగన్‌ అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చారు. తాను ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకుంటున్నానని, అమరావతి రాజధాని ఎక్కడకూ వెళ్లదని చెప్పారు. అబద్ధం చెప్పి 151 సీట్లు గెలిచారు. గెలిచిన వెంటనే ప్లేట్‌ ఫిరాయించారు. 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ప్రారంభించారు. అమరావతిని నాశనం చేశారు.

  • ఉత్తరాంధ్రకు కూడా జగన్‌ చేసిందేమీ లేదు. ఆయన కోసం రూ.700 కోట్లతో ప్యాలెస్‌ నిర్మించుకున్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. ఒక్క పరిశ్రమా తీసుకురాలేదు. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తానని కనీసం అక్కడకు ఒక్క బెంచిని కూడా తీసుకెళ్లలేదు. మాయమాటలతో మభ్యపెట్టాలని ప్రయత్నించారు. అందుకే ప్రజలు 151 సీట్ల నుంచి 11కి తీసుకొచ్చారు.

  • అప్పట్లో స్పీకర్‌ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం అమరావతి మహిళలను వేశ్యలతో పోల్చారు. పోరాటం చేస్తున్న మహిళలను పెయిడ్‌ ఆర్టిస్టులని జగన్‌ అవ మానించారు. ఆయనకు మహిళలంటే ఎంత చిన్న చూపో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

  • గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నా సభకు రావాలంటే భయపడే వాళ్లం. దారిపొడవునా రోడ్లపై 3వేల మంది పోలీసులు ఉండేవారు. జగన్‌ అసెంబ్లీకి రావాలంటే పరదాలు కట్టుకుని వచ్చేవారు. తప్పు చేశానని ఆయనకు తెలుసు కాబట్టే భయంతో బతికారు.

- అసెంబ్లీలో మంత్రి లోకేశ్‌

Updated Date - Mar 29 , 2026 | 04:44 AM